Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ వేదికపై సీనియర్ హీరోయిన్ రాధ స్టెప్పులు!

Bigg Boss 6  Update
Advertisement
  • నిన్న జరిగిన 'బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే'
  • ఈ వేదికపై సందడి చేసిన రాధ 
  • ఈ నెల 25 నుంచి ప్రసారం కానున్న 'బీబీ జోడీ' డాన్స్ షో
  • న్యాయనిర్ణేతగా కనిపించనున్న రాధ
Advertisement
తెలుగులో 1980లలో వచ్చిన అందమైన కథానాయికలలో రాధ ఒకరు. దాదాపు ఓ పదేళ్లపాటు ఆమె కథానాయికగా ఇండస్ట్రీని ఏలేసింది. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన రాధ, ఆయనతో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున సరసన కూడా ప్రేక్షకులను అలరించింది.

గ్లామర్ .. నటనతో పాటు డాన్స్ కూడా ఆమెకి ఆ స్థాయి గుర్తింపును తీసుకురావడానికి కారణమైంది. అందువల్లనే ఇప్పుడు ఆమెను ఒక డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా 'స్టార్ మా' వారు రంగంలోకి దింపుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రసారం కానున్న 'బీబీ జోడీ' అనే డాన్స్ ప్రోగ్రామ్ కి ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. 

బిగ్ బాస్ సీజన్స్ లో ఇంతకుముందు చేసినవారిలో మంచి డాన్సర్లను తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్నవారిని మళ్లీ ఒకసారికి బిగ్ బాస్ హౌస్ కి రప్పించారు. నిన్న జరిగిన సీజన్ 6 లో స్టేజ్ పై రాధ ఎంట్రీ ఇప్పించారు. చాలా కాలం తరువాత రాధ కెమెరా ముందుకు రావడం, ఈ స్టేజ్ పై స్టెప్పులు వేయడం విశేషం.
Advertisement
Advertisement
Nagarjuna
Radha
Bigg Boss

More Telugu News